ఎప్పుడు క్లీన్ సేవ్‌తో మీసం లేకుండా కనిపించే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గడ్డం, మీసంతో కనిపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కేటీఆర్ అభిమాని ఒకరు ఆయన ప్రసంగిస్తున్న స్టీల్‌కు ఫేస్‌యాప్ సాయంతో గడ్డం మీసాలు పెట్టి ఆయనకు ట్వీట్ చేశారు. ‘‘అన్నా.. గడ్డం, మీసాలతో మీరు చాలా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేశాడు.

దీనిపై స్పందించిన కేసీఆర్ ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలిపుతూ.. ‘‘ఫర్వాలేదు.. ఇలా కూడా బాగానే ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.