కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి భోజనం పెట్టలేదని ఓ కుటుంబాన్ని కులపెద్దలు సామాజిక బహిష్కరణకు గురి చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు అవమానం భరించలేమంటూ కన్నీరు,మున్నీరవుతున్నారు.
కామారెడ్డి : ఏడాది క్రితం జరిగిన marriageకి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన
Kamareddy జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు యెల్ది పోచయ్య, కొడుకు మహిపాల్, కోడలు రేణుక ఆదివారం తమ ఇంటికి తాళం వేసుకొని నిరసన తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పోశయ్య కుమార్తె ఏడాది క్రితం వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి తమకు Meals పెట్టాలని కుల పెద్దలు అడుగుతున్నారు. దుబాయ్ వెళ్లిన కొడుకు మహిపాల్ నెల రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇప్పుడైనా పెట్టించాలని పట్టుబట్టారు.
వారు అంగీకరించకపోవడంతో ఏడాది పాటు శుభ, అశుభ కార్యాలకు పిలవకుండా ఇటీవల బహిష్కరించారు. వెళితే పది వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీచేసినట్లు పేర్కొన్నారు. ఈ అవమానాలు భరించే కన్నా ఆత్మహత్య కన్నీరుమున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. సర్పంచ్ సర్పంచి రాంరెడ్డిని వివరణ కోరగా.. కులపెద్దలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భువనేశ్వర్ రావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఏలూరులో దారుణం జరిగింది. poker, కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారంతో.. వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన ఎస్సైని గ్రామస్తులు పరిగెత్తించి, చొక్కా లాగి కొట్టిన ఘటన eluru జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఎర్రవల్లిలో పేకాట, కోడి పందేలు ఆడుతున్న విషయం తెలిసి.. ధర్మాజీ గూడెం స్టేషన్ కానిస్టేబుళ్ళు ఇద్దరూ అక్కడికి వెళ్లారు. స్థానికులు దుర్భాషలాడడంతో వారు స్టేషన్కు సమాచారం అందించారు.
ఏఎస్ఐ రాంబాబు మరో కానిస్టేబుల్ తో కలిసి ఎడవల్లి చేరుకుని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వారు పోలీసులపై తిరగబడ్డారు. రాంబాబు ఎస్సై దుర్గా మహేశ్వరరావుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకు ఎస్సైకి, స్థానికులకు వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు యూనిఫాంలో ఉన్న ఎస్సైపై దాడి చేశారు. రహదారిపై పరిగెత్తిస్తూ, చొక్కా లాగేసి మరీ కొట్టారు. ఎస్సై కి గాయాలై, పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం. దీంతో సిఐ మల్లేశ్వరరావు అక్కడికి వెళ్లి ఎస్ఐని చికిత్స నిమిత్తం చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీఐ మల్లేష్ దుర్గారావు మాట్లాడుతూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత కక్షతో ఎస్సై దుర్గా మహేశ్వర రావుపై దాడి చేశారు. వారిలో కొందరిని గుర్తించామని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
