నకిలీ తెలంగాణ పోలీసు అరెస్ట్, పెళ్లి పేరుతో బెంగళూరు మహిళను మోసం చేసి...

fake telangana excise superintendent arrested in bangalore
Highlights

తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పేర్కొంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీసును బెంగళూరు పోలీసులు అరెస్ట చేశారు. తెలంగాణలో తానో పోలీస్ ఉన్నతాధికారినని చెప్పి ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. అయితే ఆమె ఫిర్యాదుతో పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.

తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పేర్కొంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీసును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తానో పోలీస్ ఉన్నతాధికారినని చెప్పి ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరు అగ్రహారానికి చెందిన అబ్దుల్ ముబారక్ కారు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అచ్చం తెలంగాణ పోలీసుల ఐడీ కార్డును పోలీన ఓ నకిలీ ఐడీని సృష్టించాడు. అందులో తన హోదాను తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఆప్ పోలీస్ గా ముద్రించుకున్నాడు. ఈ ఐడీ కార్డు ద్వారా ఈజీ మనీ సంపాదించాలని ప్రయత్నించాడు.

ఇందుకోసం అతడు ఓ యువతిని ఎంచుకున్నాడు. ఆమెకు తాను తెలంగాణ కు చెందిన పోలీస్ ఆఫీసర్ నని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి వద్ద ఉన్న ఐడీ కార్డును చూసి ఆ మహిళ కూడా నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనుకుని నమ్మి పెళ్లికి ఒప్పుకుంది. దీంతో అతడు పెళ్లి నగల షాపింగ్ పేరుతో యువతి చేత భారీగా బంగారు ఆభరణాలు కొనిపించి, ఆమె కళ్లుగప్పి కారుతో సహా ఉడాయించాడు.

దీంతో మోసపోయినట్లు గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుండి   కారు, నకిలీ ఐడీ కార్డు, 28 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 
 

loader