హైదరాబాద్: హైదరాబాద్ లో పలువురు ప్రముఖుల  వాట్సాప్ లు హ్యాక్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

హైద్రాబాద్ కు చెందిన పలువురు డాక్టర్లు, సెలబ్రిటీల వాట్సాప్ లకు  ఎమర్జెన్సీ పేరుతో కోడ్ లు వచ్చాయి.  ఎమర్జెన్సీ  హెల్ప్ అంటూ ఆరు నెంబర్ల కోడ్ లను వాట్సాప్ లకు అందాయి. 

ఈ కోడ్ అందిన తర్వాత ఓటీపీ పంపాలని రిక్వెస్ట్ లు పంపాలని కోరుతున్నారు. ఈ రిక్వెస్ట్ మేరకు ఓటీపీ నెంబర్ పంపితే వెంటనే వాట్సాప్ క్రాష్ అవుతోంది. వాట్సాప్‌నకు అందిన ఆరు నెంబర్ల కోడ్ మేరకు ఓటీపీని పంపొద్దని పోలీసులు, సైబర్ నిపుణులు కోరుతున్నారు.

ఓటీపీ నెంబర్ పంపితే వాట్సాప్ చాటింగ్ ను హ్యాక్ చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు  సూచిస్తున్నారు.

ఇవాళ ఉదయం నుండి నగరంలోని పలువురు డాక్టర్లు, సెలబ్రిటీల వాట్సాప్ నెంబర్లకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పేరుతో పలు మేసేజ్ లు వచ్చినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది. సైబర్ నిపుణులు కూడ ఇదే విషయాన్ని సూచిస్తున్నారని పోలీసులు తెలిపారు.