Asianet News TeluguAsianet News Telugu

నకిలీ ఐఎఎస్ అధికారి అరాచకం: ఆస్తుల మీద ఆస్తులు జమ

తెలంగాణలోని రామగుండం కమిషనరేట్ పరిధిలో ఓ యువకుడు ఐఎఎస్ అధికారి అవతారం ఎత్తి లక్షలాది రూపాయలు కొల్లగొట్టాడు. ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.

Fake IAS officer nabbed by ramagundam police in Telangana
Author
Ramagundam, First Published Apr 17, 2021, 5:46 PM IST

రామగుండం: నకిలీ ఐఎఎస్ అధికారిని మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఉదయ్ కుమార్ మీడియా ప్రతిననిధుల మసావేశంలో వెల్లడించారు. తాను ఐఎఎస్ అధికారిని అంటూ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 3 లక్షల రూపాయలు తీసుకున్న బర్ల లక్ష్మినారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఇందుకు సంబంధించి ఈ నెల 12, 14 తేదీల్లో మంచిర్యాల పట్టణ పోలీసు స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి.

22 ఏళ్ల వయస్సు గల బర్ల లక్ష్మినారాయణ సిద్ధార్థ కాలేజీలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అతను హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. కాగా, బీర్పూర్ మండలం లేఖలపల్లిలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

నిందితుడు అయిన బర్ల లక్ష్మి నారాయణ బీర్పూర్ మండలం రేకులపల్లికి చెందినవాడు. ఇతను పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన అనంతరం హైదరాబాదులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీ యందు బీటెక్ సెకండియర్ లో జాయిన్ అయినాడు. అదే క్రమంలో అతను రైల్వే జేఈ పరీక్షకు హాజరయ్యాడు. అయితే ఉద్యోగం రాకున్నా ఉద్యోగం వచ్చిందని ఈ గ్రామంలో  చెప్పటం తో గ్రామస్తులు అంతా నమ్మడమే కాకుండా ఇతనికి సన్మానాలు కూడా చేశారు. దీనితో ఇతనికి ప్రజలను మోసం చేయవచ్చుననే ఆలోచన కలిగింది. 

ఇతను ఇంజనీరింగ్ చేసే సమయంలో పాకెట్ మనీ కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న ఎస్బీఐ కార్డ్స్ డివిజన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసేవాడు. లాక్ డౌన్ సమయంలో 2020 మార్చి నుండి 2020 జూన్ వరకు గ్రామం లోనే ఉన్నాడు. గ్రామంలో ఉన్న వారంతా తనకు రైల్వేలో డీఈ ఉద్యోగం వచ్చిందని విశ్వసించారు. దాన్ని కొనసాగించడానికి  క్రెడిట్ కార్డు డేట్ తెలుసుకోవటం కోసం 2020 జూన్, 2020 సెప్టెంబర్ మధ్యలో పలుమార్లు సికింద్రాబాద్ వెళ్ళడానికి ప్రతిసారి తన పక్క గ్రామం బీర్పూర్  వ్యక్తి అయిన రమేష్ కారు కిరాయికి తీసుకొని వెళ్ళేవాడు, 

ఇలా పోయి వచ్చే క్రమంలో రమేష్, నిందితునికి మధ్య పరిచయాలు పెరిగి రమేశ్, నిందితుణ్ణి తన వివరాలు అడగగా తాను ప్రస్తుతం మంచిర్యాల రైల్వే స్టేషన్ లో డీఈగా పనిచేస్తున్నానని, సివిల్స్ పరీక్ష రాశానని, త్వరలో ఫలితం వస్తుందని చెప్పాడు. మొదట రమేష్ కు నెలకు 25 వేల రూపాయలు చెల్లించి తన డ్రైవర్ గా పెట్టుకొని డిసెంబర్ 2020 తను ఐఎఎస్లో సెలెక్ట్ అయ్యానని, తనకు మంచిర్యాలలో  జాయింట్ కలెక్టరుగా పోస్టింగ్ ఇచ్చారని చెప్పి, మంచిర్యాలలోని ఆదిత్య ఎన్ క్లే వ్ అపార్ట్మెంట్ లో కృతిక అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అందులోకి మకాం మార్చాడు.

అదే సమయంలో తన వద్ద డ్రైవరు గా పనిచేస్తున్న రమేష్ ని పర్మినెంట్ చేస్తున్నానని చెప్పి అతనికి నెలకు జీతం 45 వేల రూపాయలు జీతం ఇవ్వడం మొదలుపెట్టాడు. అలాగే రమేశ్ తో కలెక్టర్ అనే నేమ్ ప్లేట్ తయారు చేయించి తెప్పించాడు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అను వ్యక్తిని పీఏగా నియమించాడు. 

అలాగే తన వాహనానికి పోలీసు సైరన్ అమర్చుకోవటంతో డ్రైవరు రమేశ్, పిఏ మహేందర్ నిందితుడిని ఐఏఎస్ అధికారిగా పూర్తిగా నమ్మి అతనికి గౌరవ మర్యాదలు ఇవ్వడం ప్రారంభించారు. నిందితుడు తన డ్రైవరు రమేశ్, పీఏ మహేందర్  తాను ఐఎఎస్ అదికారిని నమ్మినట్లు పసిగట్టిన అనతరం వారిని కూర్చోబెట్టి తాను జేసీ అయినందున  20 నుంచి 30 మందికి  తన పేరుమీద ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పించవచ్చునని, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లు అయితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి దానికి గాను మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు.  

అప్పటికే నిందితుడు లక్ష్మీ నారాయణ ను ఐఏఎస్ అధికారిగా పూర్తిగా నమ్మిన డ్రైవరు రమేష్, పీఎ మహేందర్ తమతమ బంధుమిత్రులను లక్ష్మీనారాయణకు కల్పించారు. నిందితుడు వారి సర్టిఫికట్స్  పరిశీలించి వారు ఏయే ప్రభుత్వ ఉద్యోగాలను అర్హులవుతారో నిర్ణయించి వారి వద్ద నుంచి ఉద్యోగం ఇప్పించేందుకు 3 నుంచి 5 లక్షల వరకు డిమాండ్  చేస్తూ వచ్చాడు. 
ఈ క్రమంలో  2020 డిసెంబర్ నుండి 2021 మార్చి వరకు డ్రైవరు రమేష్, పి ఎ. మహేందర్ ల ద్వారా వారి బంధు మిత్రులు సుమారు 29 మంది నుండి సుమారు 80 లక్షల రూపాయలు వసూలు చేశాడు. వాటితో రెండు కార్లు, ఒక బుల్లెట్ బండి, జగిత్యాల లో ఒక ఇల్లు , ఓపెన్ శ్లాబు కొనుగోలు చేశాడు.  మిగతా డబ్బులను తన విలాసాలకు ఖర్చు చేశాడు.

లక్ష్మినారాయణ నుంచి పోలీసులు ఎంపీ హెక్టార్ కారును, నెక్షన్ కారను, రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ ను, బాదితుల సర్టిఫికెట్లను, కోర్టు డ్రెస్సును, నేమ్ ప్లేటును, డ్రైవర్ డ్రెస్సును, ఏడు రిజిష్టర్లను, 2 లక్షల 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios