భర్త ఆర్ధిక ఇబ్బందులకు కారణం భార్యకు దయ్యం పట్టడమే అని నమ్మబలికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడో దొంగబాబ. మౌలాలి పరిధిలో నివాసముంటున్న ఒక వ్యక్తి తన ఆర్ధిక ఇబ్బందులకు పరిష్కారం చూపమని నిజామాబాదు కి చెందిన యూనుస్ ఖాన్ అలియాస్ ముష్రద్ అనే దొంగ బాబాను ఆశ్రయించాడు.

బాధితుడి ఆర్ధిక ఇబ్బందులకు కారణం అతగాడి భార్య కారణం అని, ఆమెకు దయ్యం పట్టడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయని చెప్పాడు. తన దగ్గరకు ఆ బాధితుడి భార్యను తీసుకురమ్మని, తీసుకొస్తే... ఆమెకు పట్టిన దయ్యాన్ని వదలగొడతానని చెప్పాడు. 

ఆ ప్రకారంగానే తన భార్యను తీసుకొచ్చి ఆ బాబా దగ్గర వదిలి వెళ్ళాడు. బాబా చెప్పినట్టుగా వినాలని భార్యకు హితబోధ కూడా చేసాడు సదరు భర్త. భర్త వదిలి వెళ్లిన తరువాత భార్యను ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు ఆ దొంగ బాబా. 

పూజకు అన్నట్టుగా ఏర్పాట్లు చేసాడు. మంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నట్టుగా బిల్డ్ అప్ ఇచ్చాడు. ఈ తతంగం కొద్దిసేపు జరిగిన తరువాత ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ దొంగ బాబా. 

తరువాత అక్కడి నుండి భర్త వచ్చి ఏమీ ఎరగనట్టు తన భార్యను తీసుకొని మౌలాలీలోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళాక భర్తకు అక్కడ ఆ దొంగ బాబా తనమీద చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. భర్త దాన్ని చాలా లైట్ గా తీసుకున్నాడు. దీనితో భర్త ఆ దొంగ బాబాతో కలిసే ఇలా చేసాడని అనుమానం వచ్చిన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగబాబాను నాంపల్లిలో, మహిళా భర్తను మౌలాలీలో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన వెలుగు చూసిన తరువాత ఇటువంటి ధోనాగబాబాల అంతుచూడాలని, సంఘటనలు పునరావృతం కాకూడదు అని కోరుతున్నారు.