Asianet News TeluguAsianet News Telugu

స్టేషన్ ఘన్పూర్ లో ఫేక్ డాక్టర్.. పదికూడా పాస్ కాకుండానే పదేళ్లుగా వేలమందికి వైద్యం...!!

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఓ నకిలీ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్లుగా దాదాపు నాలుగు వేల మందికి అతను వైద్యం చేశాడు.

Fake doctor arrested in station Ghanpur, jangaon
Author
First Published Nov 22, 2022, 7:56 AM IST

జనగామ జిల్లా : ఫేక్ డాక్టర్ల ఉదంతాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. తాజాగా స్టేషన్గన్పూర్ లో ఇలాంటి కేసు వెలుగుచూసింది. అతనికి ఎలాంటి విద్యార్హతలు లేవు.. అయినా కూడా పదేళ్లుగా డాక్టర్ గా చలామణి అవుతున్నాడు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిలో ఆ నకిలీ వైద్యుడి భాగోతం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  ఆకాష్ కుమార్ విశ్వాస్ అనే ఈ ఫేక్ డాక్టర్ కలకత్తాకు చెందినవాడు. అతను పదోతరగతి కూడా పాస్ కాలేదు. కొంతకాలం తన తాత దగ్గర కలకత్తాలోనే ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు. ఆ తరువాత తానే డాక్టర్ అవతారం ఎత్తాడు. పదేళ్లక్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లికి చేరుకున్నాడు. అక్కడ ఓ క్లినిక్ తెరిచాడు. 

‘ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ (ఐఏఎమ్)’ అనే పేరుతో క్లినిక్ బోర్డు పెట్టుకున్నాడు. తన దగ్గరికి వచ్చే రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్స చేసేవాడు. చిన్న చిన్న జబ్బులు అతని మందులకు తగ్గేవి. ఒకవేళ రోగుల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్లయితే.. వారిని కమిషన్ ప్రాతిపదికన వరంగల్ లోని వివిధ ఆసుపత్రులకు రిఫర్ చేసేవాడు. ఈ విషయంలో పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం నకిలీ డాక్టర్  క్లీనిక్ లో తనిఖీలు చేపట్టారు. 

అతని దగ్గర క్లినిక్ నడపడానికి తగిన అనుమతులు గానీ, డాక్టర్ చదివినట్లు విద్యార్హత పత్రాలు గానీ లేనట్లు గుర్తించారు. క్లినిక్ నుంచి వివిధ పరికరాలను, అనేక మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అతని మీద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ పదేళ్లలో అతను జనగామ జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 3,650 మందికి పైగా రోగులకు చికిత్స చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు  నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రావణ్ కుమార్, డిప్యూటీ డి ఎం హెచ్ఓ సుధీర్ లతో పాటు.. వైద్యాధికారులు సాంబయ్య, భాస్కర్  తదితరులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో నకిలీ వైద్యుడిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిని..  అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అభినందించారు.

హైద‌రాబాద్: ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను ఢీకొన్న కారు.. ఒక‌రు మృతి

ఇదిలా ఉండగా, వరంగల్ లో ఇలాంటి ఫేక్ డాక్టర్ నే ఈ ఆగస్ట్ లో పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ లో ఓ నకిలీ వైద్యుడు దర్జాగా  అసలు వైద్యుడిలా చలామణి అవుతూ ఏకంగా నాలుగేళ్లలో.. 43 వేల మందికి వైద్యం చేశాడు. ఎట్టకేలకు అతని గుట్టు బయట పడింది. ఎలాంటి వైద్య విద్యా అర్హతలు లేకుండా చికిత్స చేసిన నకిలీ వైద్యుడిని, అతని సహాయకుడిని వరంగల్ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల కాలంలో ఈ నకిలీ వైద్యుడు అసలు వైద్యులను మించిపోయి.. రోజుకు 30-40మంది చొప్పున సుమారు 43 వేల మందికి వైద్యం అందించాడని దర్యాప్తులో వెల్లడయిందని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios