Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ హయాంలో నకిలీ సీఎంవో అధికారి లీలలు ... రేవంత్ హయాంలో వెలుగులోకి 

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిని అంటూ మోసాాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. 

Fake CMO Officer Arrest in Hyderabad AKP
Author
First Published Dec 10, 2023, 7:06 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఇలా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన వెంటనే కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిన ఓ కేటుగాడి ఆట కట్టించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని... ల్యాండ్ వివాదాలు పరిష్కరిస్తానంటూ మోసాలకు పాల్పడిన నకిలీ సిఎంవో అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన ప్రవీణ్ సాయి హైదరాబాద్ లో వుంటున్నాడు. బిటెక్ పూర్తిచేసిన ఇతడు ఎంటెక్ చేసేందుకు ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటుపడ్డ ప్రవీణ్ ఈజీ మనీ కోసం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అవతారం ఎత్తాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ సీఎంవో అధికారిగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇలా వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు చేసుకుంటున్నాడు. 

నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, సామాన్యులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పేవాడు ప్రవీణ్. వారిని నమ్మించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్ చూపించేవాడు. దీంతో ప్రవీణ్ నిజంగానే సీఎంవో అధికారిగా నమ్మే అమాయకులు డబ్బులు సమర్పించునేవారు. ఇలా ఇప్పటివరకు ప్రవీణ్ లక్షలాది రూపాయలు వసూలు చేసాడు. అతడికి డబ్బులిచ్చి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్పొటి పోలీసులు రంగంలోకి దిగారు. 

Also Read  Top Stories: 100 రోజుల్లో 6 గ్యారంటీలు.. మంత్రులకు శాఖలు, రైతు బంధు ఎప్పుడు?, మూడ్రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జీ

 అయితే అబ్దుల్లాపూర్ మెట్ లో భారీ ల్యాండ్ సెటిల్ మెంట్ కు సిద్దమయ్యాడు ప్రవీణ్. రూ.30 కోట్ల విలువైన భూమి వివాదంలో వుండటంతో దాన్ని తాను పరిష్కరిస్తానని... అందుకుగాను తనకు రూ.12 కోట్లు ఇవ్వాలని భూయజమానికి ఒప్పందం చేసుకున్నాడు ఈ నకిలీ సీఎంవో అధికారి. అతడిని నమ్మించి రూ. 8 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇలా ల్యాండ్ సెటిల్ మెంట్ పేరిట భారీ మోసానికి తెరతీసాడు ప్రవీణ్. 

అయితే డబ్బులిచ్చి చాలారోజులైనా భూవివాదం పరిష్కారం కాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చింది. దీంతో అతడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అప్పటికే ప్రవీణ్ మోసాలపై ఫిర్యాదులు అందడంతో గాలింపు ప్రారంభించిన పోలీసులు భూయజమాని ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో వున్నట్లు గుర్తించారు. దీంతో మాటువేసిన స్పెషల్ ఆపరేషన్ టీం చివరకు ఈ నకిలీ సీఎంవో అధికారి ప్రవీణ్ ను అరెస్ట్ చేసి మోసాలకు చెక్ పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios