ఓ యువకుడు తన తల్లితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: తన కన్నతల్లితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఓ యువకుడిపై మరో యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్రతో చావబాది ఆ తర్వాత కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ (hyderabad) లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... జగద్గిరిగుట్ట (jagadgirigutta) ప్రాంతంలోని రిక్షాపుల్లర్స్ కాలనీలో అనిల్ కుమార్(28) నివాసముంటున్నాడు. అతడు గతంలో కుత్భుల్లాపూర్ పరిధిలో పారిశుధ్ద్య విభాగంలో పనిచేసాడు. ఈ సమయంలో అతడికి ఓ మహిళా పారిశుధ్ద్య కార్మికురాలితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. 

అయితే తల్లి ఇలా అనిల్ తో ఎక్కువ సమయం ఫోన్ లో మాట్లాడుతుండటం కొడుకు శ్రీరామ్ కు నచ్చలేదు. తల్లి ఏదో పాడుపని చేస్తోందని అనుమానించిన అతడు ఆమెను గట్టిగా నిలదీసాడు. ఇలాంటి పనులు మానుకోవాలని తల్లిని హెచ్చరించాడు. 

కొడుకు హెచ్చరించిన తర్వాత తల్లి ప్రవర్తనలో మార్పు రాలేదు. అనిల్ తో ఎప్పటిలాగే ఫోన్ సంభాషణ కొనసాగించింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనయిన శ్రీరామ్ తల్లిని కాదు ఆమెతో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్న యువకుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఓ పథకం వేసాడు. 

నిన్న(గురువారం) ఓ విషయం గురించి మాట్లాడేది వుంది రావాలని అనిల్ ను శ్రీరామ్ పిలిచాడు. దీంతో సోమయ్యనగర్ లోని ఎంకే ఫంక్షన్ హాల్ వద్ద ఇద్దరూ కలుసుకున్నారు. అయితే అప్పటికే సిద్దం చేసుకున్న కర్రలు, కత్తితో అనిల్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు శ్రీరామ్. మొదట కర్రతో చితకబాది ఆ తర్వాత కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఎలాగోలా తప్పించుకున్న అనిల్ రోడ్డుపైకి వచ్చాడు.

కత్తిపోట్లు, గాయాలతో రోడ్డుపైకి వచ్చిన అనిల్ ను గమనించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అందులో అతడు కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామని... పరిస్థితి విషమంగానే వుందని తెలిపారు. 

అనిల్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నానికి పాల్పడిన శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లితో అక్రమసంబంధాన్ని కలిగివుండటం వల్లే అనిల్ ను చంపడానికి ప్రయత్నించినట్లు శ్రీరామ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే ఇలాగే వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని ఆమె భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యాడో వ్యక్తి,. ఈ ఘటన ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా వట్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. 

గొర్రెకల్ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్ (26), బోడ అంబయ్య స్నేహితులు. అయితే ఈ స్నేహాన్ని మరిచి అంబయ్య భార్యతో అశోక్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అంబయ్యకు తెలియడంతో అశోక్ ను అతి కిరాతకంగా హతమార్చాడు.

గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేష్, ఆత్కూరి నాగరాజుల సహాయంతో అంబయ్య ఈ హత్యకు పాల్పడ్డాడు. డిసెంబర్ 28వ తేదీన రాత్రి అశోక్ తన రేకుల షెడ్డులో ఒక్కడే మద్యం సేవిస్తుండగా ఈ నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవపడి అశోక్ గొంతును టవల్ తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వారు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్ మృతి చెందాడు.