Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : మందలించాడని.. లారీ డ్రైవర్ తో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో ప్రియురాలు. వివాహేతర సంబంధం గురించి తెలిసి మందలించాడని దారుణానికి తెగించింది. 

Extra-marital affair : wife killed husband along with lorry driver in rangareddy - bsb
Author
First Published Oct 24, 2023, 1:24 PM IST

రంగారెడ్డి : వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన మరో ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. భార్య  మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. దీంతో ఆమె తన ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి భర్తను హతమార్చింది. ఈ ఘటన  మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వనస్థలిపురం ఏసిపి భీమ్ రెడ్డి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

వనపర్తి జిల్లాకు చెందిన చిన్నపాగ రాములు (35), కేశమ్మ (మహేశ్వరి)  మీర్పేట్ అల్మాస్గూడ లో బతుకుతెరువు కోసం వలస వచ్చి అదే ఇంట్లో ఉంటున్నారు. రాములు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో మహేశ్వరి తన బంధువు, లారీ డ్రైవర్ గా పనిచేసే జిల్లెల్లగూడలో ఉంటున్న మంచాల రాములతో గత కొద్దిరోజులుగా చనువుగా ఉంటుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుసార్లు మందలించాడు.

తెలంగాణ ఎన్నికలు: టార్గెట్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రచార అస్త్రం..

దీంతో కోపానికి వచ్చిన మహేశ్వరి విషయాన్ని ప్రియుడికి తెలిపింది.  తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. అతడిని అంతమొందిస్తేనే తమకు మొనగాడా అని ఇద్దరు అనుకున్నారు.  దీంతో నాలుగు రోజుల క్రితం మహేశ్వరి పిల్లలతో కలిసి సంతూర్ కు వెళ్ళిపోయింది.  భార్య పిల్లలు లేకపోవడంతో.. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా  పడుకున్న రాములుపై… భార్య ప్రియుడు రాము, తెల్లపోగు దూలయ్య అనే వ్యక్తితో కలిసి  గొడ్డలితో దాడి చేశాడు.

ఈ దాడిలో గొంతు, తలమీద తీవ్రంగా గాయాలు కావడంతో  రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. రాములు గదిలో నుంచి ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మిగతాదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు  దూలయ్య,  మహేశ్వరి రాములను అరెస్టు చేశారు.  ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించారు. వారి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios