Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం : ఎనిమిదేళ్ల తరువాత వీడిన దంపతుల అదృశ్యం మిస్టరీ.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

మహబూబ్ నగర్ లో ఒక దంపతులు ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమయ్యారు. అయితే వీరి మిస్సింగ్ కేసు చాలా రోజులవరకు తేలలేదు. ఇటీవల స్మశానంకోసం గుంతలు తోడుతుంటే.. వీరిది మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్ అని తేలింది. 

Extra marital affair : missing couple mystery revealed after eight years in mahabubnagar
Author
First Published Aug 27, 2022, 10:11 AM IST

మహబూబ్ నగర్ :  మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూరుకు చెందిన భార్యాభర్తల మిస్సింగ్ మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు చేధించారు. దంపతులు అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్యలు జరిగాయని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్థుల కథనం ప్రకారం… దేవరకద్ర మండలంలోని మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్  పేరూర్ లో నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు.  

ఈ క్రమంలో పేరూర్ కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)లతో బుర్రన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ.20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ ను హెచ్చరించాడు.

నేడు హన్మకొండకు జేపీ నడ్డా: నితిన్, మిథాలీరాజ్‌లతో భేటీ కానున్న బీజేపీ చీఫ్.. షెడ్యూల్ ఇదే..

అడ్డు వస్తున్నాడని.. గొంతు నులిమి..
తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో పాటు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందాం రమ్మంటూ ఆంజనేయులు పెద్దమందడి మండలంలోని గ్రామశివారులోని ఓ పొలం వద్దకు తీసుకువెళ్లి నానేష్, రఫీలతో కలిసి గొంతునులిమి చంపేశాడు. తరువాత ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. 

ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు.. కానీ శాంతమ్మ భయపడి పోయింది. కట్టుకున్న భర్తను దారుణంగా చంపితే ఊరుకోలేని ఆమె ఈ విషయాన్ని బయటకు చెబుతాను అంది. దీంతో తన నేరం బయటపడుతుందనుకున్న బుర్రన్ ఆమెను కూడా చంపాలనుకున్నాడు. బావమరుదుల సహాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్దచెరువు వద్దకు తీసుకువెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పెట్టాడు.

డీఎన్ఏ పరీక్షతో వెలుగులోకి…
2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూరు శివారులో స్మశాన వాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. గత పదేళ్లుగా తప్పిపోయిన మహిళల సమాచారం సేకరించారు. ఈ క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్కు డీఎన్ఏ టెస్ట్ చేశారు.  అది ఎముకల DNAతో సరిపోవడ తో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్ ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios