తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. గతంలో జారీ చేసిన కరోనా ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో రోజుకు ప‌దివేల కంటే ఎక్కువ‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇది కొంత ఆందోళ‌న క‌లిగించే విష‌యం. ఇప్ప‌టికే దేశాన్ని రెండు వేవ్‌లు ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు మ‌ళ్లీ కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. కోవిడ్ -19 డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా త‌న ప్ర‌తాపం చూపిస్తోంది. గత డిసెంబ‌ర్ 2వ తేదీన దేశంలో మొద‌టి రెండు ఒమిక్రాన్ కేసుల‌ను గుర్తించారు. ఇప్పుడు ఆ సంఖ్య 1400పైగా పెరిగింది. అయితే ఇందులో ఎక్కువ మంది ఎలాంటి మెడిసిన్ అవ‌స‌రం లేకుండా కోలుకుంటున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా.. దీని ప్ర‌భావం స్వ‌ల్పంగానే ఉంటోంది. ఇవి కొంత ఊర‌టనిచ్చే అంశాలు.

పెళ్లైన వారం రోజులకే వికారాబాద్‌ వన్‌టౌన్‌ ఎస్‌ఐ మృతి

తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఆంక్ష‌లు విధిస్తోంది. క్రిస్మ‌స్, న్యూయ‌ర్ వేడుక‌ల సంద‌ర్భంగా క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని గ‌త నెల ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. డిసెంబ‌ర్ 25వ తేది నుంచి జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ప్రభుత్వం గ‌తంలో ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే క‌రోనా కేసుల పెరుగుద‌ల‌లో వేగం క‌నిపిస్తుండ‌టంతో ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని స‌వ‌రించింది. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టాల‌నే ఉద్దేశంతో క‌రోనా ఆంక్ష‌లు జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

స‌భలు, స‌మావేశాలు నిషేదం
ప్రభుత్వం శ‌నివారం విడుదల చేసిన ఉత్త‌ర్వులు ప్ర‌కారం.. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు, బ‌హిరంగ, సామూహిక సమావేశాలు పూర్తిగా నిషేదం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ఇత‌ర ఆఫీసుల‌కు వెళ్లే వారు త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు ధరించాలి. ఆయా కార్యాల‌యాలు తరచుగా శానిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ప్ర‌వేశాల ద‌గ్గ‌ర థ‌ర్మల్ స్కానర్‌లతో టెంప‌రేచ‌ర్ చెక్ చేయాల్సి ఉంటుంది. అంద‌రూ భౌతిక‌దూరం పాటించాల్సి ఉంటుంది. 

స్కూల్స్‌, కాలేజీలు, ఇత‌ర విద్యాసంస్థ‌ల యాజమాన్యాలు, ఉద్యోగులు, పిల్ల‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాలి. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులు మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ.1,000 జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో తెలిపింది. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పింది. కోవిడ్ -19 రూల్స్ క‌చ్చితంగా అమలు చేయాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, మున్సిప‌ల్ కమిష‌నర్‌ల‌ను, పోలీసు సూపరింటెండెంట్‌లను ప్ర‌భుత్వం ఆదేశించింది.

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఒక్కరోజులో 6 వేల NGOsల విదేశీ విరాళాలు కట్​!

తెలంగాణ‌లో 12 ఒమిక్రాన్ కేసులు...
తెలంగాణ‌లో 12 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం విడుద‌ల చేసిన బులిటెన్ లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 79కి చేరుకుంది. శ‌నివారం వెలుగులోకి వ‌చ్చిన 12 కేసుల్లో ముగ్గురు రెడ్ లిస్ట్ దేశాల ఉంచి, మిగిలిన తొమ్మిదిమంది ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చార‌ని ప్ర‌భుత్వం తెలిపింది.