హైదరాబాద్‌లోని పేట్‌బషీర్‌బాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి చేతిలో వున్న బ్యాగులో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు  సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌లోని పేట్‌బషీర్‌బాద్‌లో పేలుడు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి చేతిలో వున్న బ్యాగులో ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం తేరుకుని బ్యాగ్‌తో వున్న వ్యాక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.