Asianet News TeluguAsianet News Telugu

సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప.. రైతులపై పట్టింపేది - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అకాల వర్షాలకు పంట నష్టం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం ఆరోపించారు.

Except for seats and votes panchayat. KTR criticises Revanth Reddy for taking care of farmers..ISR
Author
First Published Mar 20, 2024, 5:40 PM IST

తెలంగాణలో అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో కూడా రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏఐసీసీ నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీ పర్యటనల కంటే రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. 

ఆ ట్వీట్ యథావిధిగా.. 
 ** ముఖ్యమంత్రి గారు.. 
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?

నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. 
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??

ఎన్నికల గోల తప్ప.. 
ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?

సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. 
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??

ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? 
పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??

పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. 
రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?

ఇంతకాలం.. 
పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!

ఇప్పుడు.. 
నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?

గుర్తు పెట్టుకోండి..!!
ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!

అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై.. 
భారత  “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!! ’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios