పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. తెలంగాణలో జలదోపిడీ జరుగుతోందని ఆరోపించారు.  గతంలో ఆంధ్రవాళ్లు జల దోపిడీ చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారని అయితే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్‌ పాలనలోనూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. 

గోదావరి పరిసర ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. అనవసరమైన రిజర్వాయర్లు కట్టి నీటిని తరలిస్తున్నారని సంచలన ఆరోపణలు ఆరోపించారు. ఇలాంటి చర్యలను జలదోపిడీ కాకపోతే ఏమంటారని నిలదీశారు.  

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తోందా అన్న సందేహం కలుగుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. జలదోపిడీని ఆపకపోతే ప్రజలే సరైన సమాధానం చెప్తారని హెచ్చరించారు.