కేసీఆర్‌తో దేవేగౌడ భేటీ..ఫెడరల్ ఫ్రంట్ కోసమేనా..?

మాజీ ప్రధాని.. జేడీఎస్ అధినేత దేవేగౌడ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం భాగ్యనగరానికి వచ్చిన ఆయన ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా దేవేగౌడను కేసీఆర్ సత్కరించారు. కర్ణాటక ఎన్నికలు ముగియడం.. కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కాస్త మౌనంగానే ఉన్నారు. తాజా భేటీతో కూటమి దిశగా మరో ముందడుగు పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.