Asianet News TeluguAsianet News Telugu

మీ వల్ల నా చేయి పరిస్థితి చూడండి: కేంద్ర మంత్రిని నిలదీసిన మధుయాష్కి

న్యూడిల్లీ విమానాశ్రయంలో కెమికల్స్ కలిగిన సిరాతో స్టాంపింగ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ex mp madhu yashki serious on civil aviation ministry
Author
New Delhi, First Published Oct 5, 2020, 1:01 PM IST

న్యూడిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా విదేశాల నుండి వచ్చేవారికి గుర్తించేందుకు విమానాశ్రయాల్లో స్టాంపింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా చేతిపై చేస్తున్న ఈ స్టాంపింగ్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇలా కెమికల్స్ కలిగిన సిరాతో స్టాంపింగ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఫిర్యాదు చేశారు. 

''ప్రియమైన హర్దీప్ సింగ్ పూరీ గారికి...విదేశాల నుండి వచ్చేవారి చేతిపై డిల్లీ విమానాశ్రయంలో వేస్తున్న స్టాంపింగ్ కోసం ఉపయోగిస్తున్న కెమికల్స్ ను ఓ సారి పరిశీలించండి. నిన్న నాకు కూడా డిల్లీ విమానాశ్రయంలో స్టాంప్ వేశారు. దానివల్ల నా చేతి పరిస్థితి చూడండి'' అంటూ స్టాంప్ చేసిన తన చేయిని పోటో తీసి ట్వీట్ కు జత చేశారు మధుయాష్కి. ఈ ట్వీట్ ను విమానయాన మంత్రికి ట్యాగ్ చేశారు. 

మధుయాష్కి ట్వీట్ పై స్పందించిన విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ దీనిపై ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా  ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఢిల్లీ విమానాశ్రయ అధికారులు కూడా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని... స్టాంపింగ్ కోసం ఉపయోగించిన ఇంకును నిపుణుల చేత పరీక్ష జరిపిస్తామన్నారు. ప్రమాదకరమని తేలితే చర్యలు తీసుకుంటామని విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios