టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ
నిజమాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీకి కోపమోచ్చింది. టీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రావుల పాలన నడుస్తోందని, రావుల పాలనలో ప్రజలకు ఏమీ రావని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యవహార శైలిని తప్పుబట్టారు.
ఐఏఎస్ లతో సేవలు చేయించుకుంటూ ఎంపీ కవిత తనను తాను దొరసానిగా భావిస్తున్నారని దుయ్యబట్టారు. బంగారు వడ్డాణం ఇస్తానంటేనే కార్యక్రమాలకు వెళ్లే ఎంపీకి కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి లేదన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏ టీం, బి టీంలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
