సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభ వేదికపై తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.
గత కొద్దిరోజులుగా బీజేపీలో (bjp) చేరాలా, కాంగ్రెస్ లో (congress) చేరాలా అన్న డైలమాలో వున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (konda vishweshwar reddy) కాషాయ తీర్ధం పుచ్చుకోవాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆయన మీడియాతో ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు బీజేపీలో చేరేది మాత్రం ఆయన చెప్పలేదు. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల సమక్షంలో తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
ALso Read:తెలంగాణలో కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు.. బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
అంతకుముందు .. గురువారం విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడిందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు అంత శక్తి లేదంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణవాదులను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. నియంత పాలనను అంతం చేయడం బీజేపీకే సాధ్యమని కొండా పేర్కొన్నారు. కేసీఆర్ పక్కన పువ్వాడ, తలసాని, సబిత, తలసాని లాంటి వాళ్లు వున్నారని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీ ఎక్కువైందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ తొందర్లోనే ఖతం అవుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. యాంటీ కేసీఆర్ ఓటు బీజేపీకే వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు అంశాలపై బీజేపీని క్లారిటీ అడిగానని.. 2 అంశాలపై స్పష్టత ఇచ్చారని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
