సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్న ఆమె అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉజ్జయినీ మహాంకాళీకీ సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.