Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ టు అమెరికా...మంచిర్యాల యువతికి అరుదైన అవకాశం: అభినందించిన కవిత(వీడియో)

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ యూనివర్సిటీలో సీటు సాధించిన మంచిర్యాలకు చెందిన సుహర్షను మాజీ ఎంపీ కవిత ప్రత్యేకంగా అభినందించారు. 
 

Ex MP Kavitha Appreciates Manchirial Girl
Author
Hyderabad, First Published Jul 25, 2020, 7:06 PM IST

మంచిర్యాల: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక అబర్న్ యూనివర్సిటీలో సీటు సాధించిన మంచిర్యాలకు చెందిన సుహర్షను మాజీ ఎంపీ కవిత ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. సుహర్షతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన  కవిత అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుహర్షతో పాటు ఆమె తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు కవిత.

కుటుంబం, వ్యక్తిగత వివరాల గురించి యువతితో కూలంకషంగా చర్చించారు మాజీ ఎంపీ. సుహర్ష మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన కవిత... రాష్ట్ర యువతకు ఆమె ఆదర్శం అన్నారు.

వీడియో

"

మంచిర్యాలకు చెందిన సుహర్ష, హైదరాబాద్ శివారు ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు పూర్తి చేసారు. ఫారెస్ట్ యూనివర్సిటీ మరియు అబర్న్ యూనివర్సిటీ మధ్య జరిగిన ఎంఓయూ మేరకు ప్రస్తుతం అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో సుహర్ష ఎంఎస్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) లో సీటు సాధించారు. అంతేకాక యూనివర్సిటీ నుండి రూ. 50 లక్షల ఉపకారవేతనం, ట్యూషన్ ఫీజు మినహాయింపు పొందారు సుహర్ష.

సుహర్షతో మాట్లాడుతున్న సమయంలో  కవిత తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన రోజుల్లోని జ్ఞాపకాలను సుహర్షతో పంచుకున్నారు. మిసిసిప్పిలో ఎంఎస్ చదువుకున్నట్లు... అప్పుడు 500 డాలర్లు స్టైఫండ్ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సుహర్ష సీటు సాధించిన అలబామా పక్కన ఉండే మిసిసిప్పి నగరంలోనే  నివసించినట్లు తెలిపారు. అక్కడి పరిస్థితులను సుహర్షతో పంచుకున్నారు.

వీడియో2

"

కవితక్క అంటే ఎనలేని అభిమానమని...ఆమెకు పెద్ద అభిమానినని సుహర్ష అన్నారు. కవితక్క పలుమార్లు మంచిర్యాల ప్రాంతంలో పర్యటించినప్పుడు, మాట్లాడటానికి ప్రయత్నించినా అవకాశం దొరకలేదన్న సుహర్ష... ఇప్పుడు స్వయంగా ఆమే ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, అటవీ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీన్ చంద్రశేఖర్ రెడ్డిలకు సుహర్ష కృతజ్ఞతలు తెలిపారు. అభిమాన నాయకురాలు స్వయంగా ఫోన్ చేసి అభినందించడం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు.  భవిష్యత్తులో స్వరాష్ట్రానికి సేవలు అందిస్తానని సుహర్ష తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios