ముందే ఊహించాం.. ఆయన శరీరం మాత్రమే బీజేపీలో , ఆత్మ కాంగ్రెస్‌లోనే : రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై నర్సయ్యగౌడ్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో వుందని, ఆత్మ కాంగ్రెస్‌లోనే వుందంటూ నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. 

ex mp boora narsaiah goud sensational comments on komatireddy rajagopal reddy ksp

అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల నుంచి పెద్ద ఎత్తున నేతలు హస్తం పార్టీ గూటికి చేరుకుంటున్నారు. దీంత కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదని.. అంతా ఎప్పుడో ఊహించారని ఆయన వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో వుందని, ఆత్మ కాంగ్రెస్‌లోనే వుందంటూ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్ధితుల్లో జనాలు లేరని.. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించేపనిలో పనిలో పార్టీలకతీతంగా అందరూ పనిచేస్తున్నారని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో దిగుతానని నర్సయ్య గౌడ్ తెలిపారు. అయితే తనకు భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని తన మనసులోని మాటలను ఆయన బయటపెట్టారు. 

ఇకపోతే.. బీజేపీ నాయకత్వం తీరుపై  కొంతకాలంగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడ బీజేపీని వీడి  కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.  ఈ నెల  22న బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు  చోటు దక్కలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డితో  రెండు మూడు దఫాలు చర్చించారు. ఇవాళ ఉదయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా  కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్  టిక్కెట్టు విషయమై హామీ ఇచ్చారని  సమాచారం. 

ALso Read: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

2022 ఆగస్టు మాసంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలపై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు.

బీజేపీలోని కొందరు నేతలు  రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడ సాగుతుంది.  ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ నెల  27న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  కాంగ్రెస్ లో చేరేందుకు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రేపు న్యూడీల్లీకి వెళ్లనున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios