తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై బెట్టింగ్ కట్టి.. ఓ మాజీ ఎమ్మెల్యే రూ.50వేలు పోగొట్టుకున్నాడు. కురవి మండలానికి చెందిన మానుకోట మాజీ ఎమ్మెల్యే డోర్నకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్ రాంచంద్రునాయక్ విజయం సాధిస్తారని రూ.50వేలు పందెం కాశారు.

మానుకోటలో ఉంటూకురవిలో రెడ్యానాయక్ కు అనుచరుడిగా ఉన్న ఎర్రబుల్లెట్ రావు.. రెడ్యా నాయక్ గెలుస్తారని పందెం కాశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరూ చెరి రూ.50వేలు డిపాజిట్ చేశారు. రెడ్యానాయక్ గెలుపొందడటంతో.. ఎర్రబులెట్ రావు విజయం సాధించారు. దీంతో... మాజీ ఎమ్మెల్యే, పందెంలో ఓడిపోయి.. ఎర్ర బులెట్ రావుకి రూ.50వేలు ఇవ్వాల్సి వచ్చింది.