Asianet News TeluguAsianet News Telugu

నన్ను టీఆర్ఎస్ నాయకులే ఓడించారు: తుమ్మల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలా రాష్ట్రవ్యప్తంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగగా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఓటమిపాలయ్యారు. అయితే తన ఓటమికి గల కారణాలపై గతకొంతకాలంగా సమీక్షలు జరుపుతున్న తుమ్మల తాజాగా సొంతపార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. 

ex minister tummala nageshwara rao fires on his own party leaders
Author
Khammam, First Published Feb 11, 2019, 8:29 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ పార్టీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇలా రాష్ట్రవ్యప్తంగా అన్ని జిల్లాలో టీఆర్ఎస్ హవా కొనసాగగా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఓటమిపాలయ్యారు. అయితే తన ఓటమికి గల కారణాలపై గతకొంతకాలంగా సమీక్షలు జరుపుతున్న తుమ్మల తాజాగా సొంతపార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. 

పాలేరు నియోజకర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తనను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారని తుమ్మల ఆరోపించారు. వారు నన్ను కాదు... రాజకీయ జీవితాన్ని అందించిన కన్నతల్లి లాంటి పార్టీకి మోసం చేశారని అన్నారు. ఇలా మోసాలు, కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తూ పార్టీకి మోసం చేసే వారు ఎక్కువకాలం రాజకీయాల్లో వుండలేరని తుమ్మల విమర్శించారు. 

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన టీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లతో తుమ్మల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనను ఓడించి కొందరు ప్రస్తుతం తాత్కాలిక ఆనందం పొందుతున్నారని అన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులే కుట్రలు పన్ని తనను ఓడించారని తుమ్మల నాగేశ్వరరావు ఆవేధన వ్యక్తం చేశారు.      
 
Follow Us:
Download App:
  • android
  • ios