షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సి. ప్రతాప్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.  దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో శంకరరావు పనిచేసారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పి. శంకర రావు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ సమాజ్ వాదీ పార్టీ లో చేరారు. 

పార్టీ అధ్యక్షుడు సింహాద్రి సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. షాద్ నగర్ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా షాద్‌నగర్ నుంచి శంకర్రావు పోటీ చేస్తారు. 

షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సి. ప్రతాప్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో శంకరరావు పనిచేసారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

తనను బలిపశువును చేశారని ఆయన ఆవేదన చేశారు. పార్టీలో విధేయులకు చోటులేదని.. కాంగ్రెస్‌కు మూలస్థంభాలైన చెన్నారెడ్డి, వెంకటస్వామి కుటుంబాలకు పార్టీలో చోటులేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్‌ కీలక నేత ఏనుగు మనోహర్ రెడ్డి కూడా పార్టీ మారాలని నిర్ణియించుకున్నారు. తాను ఆశించిన కరీంనగర్ జిల్లా వేములవాడ టికెట్‌ ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరడానికి సిద్ధపడ్డారు.

ఆదివారం సాయంత్రం కేటీఆర్ సమక్షంలో ఏనుగు మనోహర్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. వేములవాడ టికెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ రెండు సార్లు మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.