రేవంత్ ఓడిపోలేదా, అతని వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది.. కేసీఆర్‌తో భేటీ తర్వాతే తుది నిర్ణయం : పొన్నాల

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య . జనగామలో తాను ఎందుకు ఓడిపోయానని వ్యాఖ్యానిస్తున్న రేవంత్.. కొడంగల్‌లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు.

ex minister ponnala lakshmaiah sensational comments on tpcc chief revanth reddy ksp

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. శనివారం పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేటీఆర్. అనంతరం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు. జనగామలో తాను ఎందుకు ఓడిపోయానని వ్యాఖ్యానిస్తున్న రేవంత్.. కొడంగల్‌లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాతే కొడంగల్‌లో ఓడిపోయారని పొన్నాల దుయ్యబట్టారు. రేవంత్‌తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డిలు ఓడిపోలేదా అని లక్ష్మయ్య నిలదీశారు. 

తనను అవమానించిన రేవంత్ అసలు కాంగ్రెస్‌లోకి ఎప్పుడు వచ్చారు.. తాను ఎప్పటి నుంచి కాంగ్రెస్‌లో వున్నది ప్రజలకు తెలియదా అని పొన్నాల ప్రశ్నించారు. ఐకమత్యమే పార్టీకి బలం అని.. కో ఆర్డినేషన్, కౌన్సెలింగ్, కమ్యూనికేషన్ కోసమే రాజకీయాల్లో పదవులు అని లక్ష్మయ్య తెలిపారు. అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకుంటే అంతకుమించిన బుద్ధి తక్కువ పని ఎవరు చేయరని పొన్నాల దుయ్యబట్టారు. 

ALso Read: ఈ నెల 16న బీఆర్ఎస్‌లోకి పొన్నాల.. కేసీఆర్‌తో భేటీ తర్వాతే జనగామ టికెట్‌పై క్లారిటీ : కేటీఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయి.. ఉపఎన్నికల్లో సైతం డిపాజిట్లు పోయాయని లక్ష్మయ్య చురకలంటించారు. తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని.. పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేశారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనను బీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారని.. కేసీఆర్ కూడా కోరినట్లు పొన్నాల తెలిపారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను సమావేశమవుతానని.. అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని లక్ష్మయ్య వెల్లడించారు. 

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సూచన మేరకే పొన్నాల ఇంటికి వచ్చానని చెప్పారు. పార్టీలో చేరేందుకు పొన్నాల సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. పొన్నాలకు బీఆర్ఎస్‌లో సముచితమైన స్థానం కల్పిస్తామని.. ఆదివారం కేసీఆర్‌ను పొన్నాల లక్ష్మయ్య కలుస్తారని కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత జనగామ టికెట్ ఇతర అంశాలపై క్లారిటీ వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 1960లలోనే పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో ఇంజనీరింగ్ చదివి, నాసా లాంటి సంస్థల్లో పనిచేశారని కేటీఆర్ ప్రశ్నించారు. 

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్‌లో చేరారని మంత్రి గుర్తుచేశారు. అయన వయసు, అపారమైన అనుభవానికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తూలనాడాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తీరును పార్టీలకి అతీతంగా ఖండిస్తున్నారని తెలిపారు. పీసీసీ చీఫ్ .. తొలుత బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాడని దుయ్యబట్టారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్ రెడ్డి నీతులు మాట్లాడటమేంటని కేటీఆర్ చురకలంటించారు. 

Also Read: ఉప్పల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేయనున్న రేవంత్ అనుచరులు..

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను తీసుకెళ్లి పీసీసీ చీఫ్‌ను చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. డబ్బు సంచులకు కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారని మంత్రి ఆరోపించారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ పొన్నాలను ఉద్దేశించి మాట్లాడినట్లుగా తనకు తెలిసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకపు సింహసనంపై శునకం అన్న విధంగా రేవంత్ తీరు వుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios