Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేయనున్న రేవంత్ అనుచరులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయం మరింతగా వేడెక్కెంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే తెలంగాణలో అధికారం లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

Congress Leader Sirisha Somasekhar Reddy likely to resign party ksm
Author
First Published Oct 14, 2023, 4:55 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత రాజకీయం మరింతగా వేడెక్కెంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే తెలంగాణలో అధికారం లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొందరు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.టీపీసీసీ చీఫ్ రేవంత్ అనుచరులుగా పేరున్న.. ఉప్పల్ నియోజకవర్గంలోని  ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష, ఆమె భర్త సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. రేపు వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా  తెలుస్తోంది.

ఇక, గ్రేటర్ పరిధిలో రేవంత్ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న  సోమ శేఖర్ రెడ్డి.. ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆహ్వానించారు. అయితే ఆ దిశగా వారికి హామీ లభించనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు న్యాయం జరగలేదంటూ సోమశేఖర్ రెడ్డి  తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios