Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి నర్సింహులు.. ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే..?

సీనియర్ రాజకీయ వేత్త.. మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu) టీఆర్ఎస్‌లో (trs) చేరేందుకు ముహూర్తం ఖరారైంది .ఈ నెల 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో (telangana bhavan) టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

ex minister motkupalli narsimhulu entry into the trs has been finalized
Author
Hyderabad, First Published Oct 16, 2021, 3:15 PM IST

సీనియర్ రాజకీయ వేత్త.. మోత్కుపల్లి నర్సింహులు (mothkupally narsimhulu) టీఆర్ఎస్‌లో (trs) చేరేందుకు ముహూర్తం ఖరారైంది .ఈ నెల 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో (telangana bhavan) టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా (yadadri bhuvanagiri district) ఆలేరు (aleru) నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని సీనియర్‌ నేతల్లో ఒకరు. గతంలో టీడీపీ (tdp), కాంగ్రెస్‌ (congress) పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీ (bjP) లో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

ఈ సమయంలో కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై (dalit bandhu scheme) పొగడ్తల వర్షం కురిపించారు నర్సింహులు. ఏకంగా అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు మోత్కుపల్లి. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని నర్సింహులు పిలుపునిచ్చారు. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే ఇరు వర్గాల నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Also Read:దళితబంధు ఛైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు.. త్వరలోనే అధికారిక ప్రకటన..?

ఆయన టీఆర్ఎస్‌లో చేరితే ఏ రకమైన పదవి వస్తుందన్న దానిపైనా చర్చ కూడా సాగింది. సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులకు కీలక పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లి నర్సింహులును చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ ముందునుంచే అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు ఊతమిచ్చే విధంగానే గడిచిన కొన్నిరోజులుగా పరిణామాలు జరుగుతున్నాయి. 

కాగా, గతంలో టీడీపీలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి అనేక సందర్భాల్లో గట్టిగా విమర్శించారు. మిగతా నాయకులకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్.. అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులును ఎదుర్కోవడంతో మాత్రం ఇబ్బందిపడిందనే వాదన ఉంది. అలాంటి మంచి వాగ్థాటి  వున్న మోత్కుపల్లికి దళితబంధు అమలుకు సంబంధించిన కీలక పదవి ఇవ్వడం ద్వారా.. ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళతారని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాజకీయాల్లో మళ్లీ ఓ వెలుగు వెలగాలని ఎదురుచూస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కోరిక త్వరలోనే నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios