వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం కోసం శనివారం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. డెంటల్ కాలేజీ సమీపంలో, శివారెడ్డి పేట, ఎన్నేపల్లి ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చించి ఏ ప్రాంతంలో భవన నిర్మాణం ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో స్థల సేకరణ పూర్తి చేసి.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. 

కేటీఆర్ న్యాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారుతుందని ఈ సందర్భంగా ఆయన  చెప్పారు. ఆయన వెంట పార్టీ పరిశీలకులు ఎంఎల్సీ గంగాధర్ గౌడ్,
ఎంఎల్ఏ ఆనంద్,టీఎస్ విద్యా వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ లు ఉన్నారు.