Asianet News TeluguAsianet News Telugu

మన ప్రభుత్వం రాలేదని కుంగిపోవద్దు .. భవిష్యత్తు బీఆర్ఎస్‌దే : హరీష్‌రావు భావోద్వేగం

మన ప్రభుత్వం రాలేదని కుంగిపోవద్దన్నారు బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు . అధికారంలో వున్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదని హరీష్ పేర్కొన్నారు . కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని , భవిష్యత్తు మనదేనని ఆయన స్పష్టం చేశారు.  
 

ex minister harish rao emotional during brs activists meeting at sangareddy ksp
Author
First Published Dec 12, 2023, 3:52 PM IST

మన ప్రభుత్వం రాలేదని కుంగిపోవద్దన్నారు బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారని.. వాళ్లు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని హరీశ్ రావు చెప్పారు. అధికార పార్టీ నేతలు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్లు కొన్ని దుష్ప్రచారాలు చేశారని .. ప్రజలు నమ్మారు కాబట్టే అధికారం ఇచ్చారని మాజీ మంత్రి పేర్కొన్నారు. అధికారంలో వున్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదని హరీష్ పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ అధికారంలో వున్నా.. ప్రతిపక్షంలో వున్నా తాము ఎప్పుడూ ప్రజల పక్షమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని.. ఫలితాలపై త్వరలోనే సమీక్ష నిర్వహించుకుందామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొంత ఇబ్బంది వున్నా.. సంగారెడ్డిలో మాత్రం ఈసారి గులాబీ జెండా ఎగిరిందని హరీశ్ చెప్పారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా.. ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్ధిగా కష్టపడి పనిచేశారని , పార్టీ కోసం కష్టపడిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుందామని ఆయన పేర్కొన్నారు. 

ALso Read: KTR: రైతు బంధు వేసి 6 నెలలు తప్పించుకున్నరు.. కేటీఆర్ విమర్శలు స్టార్ట్

వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని హరీష్ రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పెట్టినప్పుడే ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణాను దేశంలోని అన్ని రంగాల్లో నెంబర్ వన్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్సేనని హరీష్ రావు వెల్లడించారు. కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని , భవిష్యత్తు మనదేనని ఆయన స్పష్టం చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios