Asianet News TeluguAsianet News Telugu

జెండాకి ఒక్కరే ఓనర్ ఉండడు.. అప్పుడు ఇదే చెప్పా, ఇప్పుడూ నా మాట అదే: ఈటల వ్యాఖ్యలు

జెండాకి ఒక వ్యక్తి ఓనర్ ఉండడు అని చెప్పానని గుర్తుచేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనరే అని చెప్పాల్సిందేనన్నారు. ఇదే హుజురాబాద్‌లో నేను కూడా ఓనరేనని చెప్పానని ఈటల వ్యాఖ్యానించారు.

ex minister etela rajender sensational comments on trs party ksp
Author
huzurabad, First Published Jun 19, 2021, 4:55 PM IST

జెండాకి ఒక వ్యక్తి ఓనర్ ఉండడు అని చెప్పానని గుర్తుచేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనరే అని చెప్పాల్సిందేనన్నారు. ఇదే హుజురాబాద్‌లో నేను కూడా ఓనరేనని చెప్పానని ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు తనను ఆరుసార్లు గెలిపించారని రాజేందర్ అన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని ఈటల జోస్యం చెప్పారు. తమ హక్కులకు భంగం కలిగితే దేనికైనా రెడీగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారం నెత్తికెత్తి అహంకారంతో మాట్లాడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. 

కాగా, ఈటల సతీమణి జమున నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకొన్నాం, కానీ కొత్త ఉద్యోగాలు లేవన్నారు. కానీ గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ భార్య ఈటల జమున రెండో రోజు పర్యటిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం  నేరేళ్ల గ్రామంలో ఆమె పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈటల రాజేందర్ కు అండగా ఉండాలని ఆమె కోరారు.

Also Read:ఎన్టీఆర్, కేసీఆర్ రాజకీయాలు: ఈటల రాజేందర్ ఎగ్జిట్ వెనక

నేరెళ్ల గ్రామ ప్రజల ఆత్మీయతకు రుణపడి ఉంటామని చెప్పారు.ఈటెలరాజేందర్ ను ఏ పార్టీలో ఉన్న గెలిపిస్తామని చెబుతున్నారన్నారు. మంత్రి పదవి నుండి రాజేందర్ ను  తీసివేసినా తమ గుండెల్లో రాజేందర్ ఉన్నాడని  గ్రామస్తులు చెప్పారన్నారు.  యువతను చూసి గర్వపడుతున్నానన్నారు. సెక్రటేరియట్ కట్టడానికి పైసలు ఉంటున్నాయి కానీ పేద ప్రజలకు ఇళ్లు కట్టించడానికి డబ్బులు లేవా ? అని ఆమె ప్రశ్నించారు.పేద తల్లులు కనిపించడం లేదా ? ఇలాంటి ప్రభుత్వాలు మనకు వద్దు. ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాలు కావాలన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు కానీ హుజురాబాద్ ఎన్నికలు రాగానే ఇక్కడ అవన్నీ రెండు వారాల్లో ఇస్తాం అంటున్నారని ఆమె గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios