టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్లడ్‌లో భయం లేదని స్పష్టం చేశారు. కరోనా తగ్గిన తర్వాత రాజీనామాపై నిర్ణయం ప్రకటిస్తానని ఈటల పేర్కొన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయాలు మంచిది కాదని రాజేందర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. తనపై బదులు కరోనా మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచడం ముమ్మాటికీ తప్పేనని ఈటల ఆరోపించారు. వయోపరిమితి పెంపుపై ఉద్యోగులు కూడా అసంతృప్తిగా వున్నారని రాజేందర్ పేర్కొన్నారు. 

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ దేవరయంజాల్ లో ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేయడంపై నిన్న హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవరయంజాల్ భూములపై విచారణకు ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. 

Also Read:ఈటల భూములపై కమిటీ: కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

నలుగురు అదికారులతో కమిటీ వేస్తూ ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్లు వేశారు. ఆ జీవోను ప్రస్తావిస్తూ... కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇంత హడావిడి అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. మిగిలిన ఆలయ భూముల సంగతేమినటని ప్రశ్నించింది.

దేవరయంజాల్‌లో ఈటల రాజేందర్ ఆలయ భూములను అక్రమించుకున్నారనే ఆరోపణపై ప్రభుత్వం విచారణకు నలుగురు అధికారులతో కమిటి వేసింది. దానిలో భాగంగా మెదక్ జిల్లాలోని అచ్చంపేట అసైన్డ్ భూములను అక్రమించారనే ఆరోపణపై విచారణ చేయించి, ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం తేల్చింది. ఆ విచారణ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే