హైదరాబాద్‌: టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభ పెద్ద ఫ్లాప్ షో అని మాజీ మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ప్రగతి నివేదన సభ నిర్వహణలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. 25 లక్షల మంది సభకు హాజరవుతారని టీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలికారని, తీరా చూస్తే రెండున్నర లక్షల మందే సభకు వచ్చారన్నారు. ప్రగతి నివేదన సభ ఉద్దేశ్యం ఏంటో వాళ్లకైనా అర్థమైందా అని ప్రశ్నించారు. 

సభ ద్వారా కేసీఆర్‌ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇచ్చారని, అసలు సభ ఉద్దేశమైనా నెరవేరిందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ శకం ముగిసిందని టీఆర్ఎస్ ఇక అధికారంలోకి రావటం కల్లా అని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఉన్న జన, ధన బల నిరూపణకే ప్రగతి నివేదన సభ నిర్వహించారని, అయినా ప్రజల నుంచి సరైన స్పందన రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని డీకే అరుణ విమర్శించారు.