హోర్డింగ్ ఎక్కిన హోంగార్డ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్

Ex home guards protest in khairatabad, full traffic jam
Highlights

ఫుల్ ట్రాఫిక్ జామ్

తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించారని.. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కొందరు హోంగార్డులు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో మెరుపు ఆందోళనకు దిగారు. ఉద్యోగం కోల్పోయిన ఓ హోంగార్డు హార్డింగ్‌పైకి ఎక్కగా... మరికొందరు తమ కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై ఎండలో పిల్లలతో సహా బైటాయించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. 

బురన్‌గౌడ్‌ అనే హోంగార్డు ఖైరతాబాద్‌ చౌరస్తా సమీపంలోని హోర్డింగ్‌ పైకి ఎక్కాడు. ఉమ్మడి రాష్ట్రంలో అర్డర్‌ కాఫీలు లేవన్న కారణం చూపుతూ దాదాపు 350 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని హోంగార్డులు వాపోయారు. యూనిఫామ్‌ ఇచ్చి... జీతాలు ఇస్తూ... గుర్తింపు కార్డులు ఉన్నా ఉద్యోగాల నుంచి ఎలా తొలగించారని వారు ప్రశ్నించారు. 

తొలగించిన హోంగార్డులను వెంటనే విధులలోకి తీసుకోవాంటూ గత మార్చిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినా ఇంత వరకు ఏ ఒక్క అధికారి స్పందించలేదని మండిపడ్డారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. బలవంతంగా తమను ఇక్కడి నుంచి తరలిస్తే.. ఇంటికి వెళ్లి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హోంగార్డులు హెచ్చరించారు.

loader