Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ కరోనాను అడ్డం పెట్టుకున్నారు : రాజీనామా సమర్పణపై ఈటల (వీడియో)

నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ కు అందించాలని అనుకున్నానని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామా తరువాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో ఈటల రాజేందర్  మాట్లాడారు. 

etela rajender speech at assembly media point  - bsb
Author
Hyderabad, First Published Jun 12, 2021, 1:22 PM IST

నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ కు అందించాలని అనుకున్నానని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామా తరువాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో ఈటల రాజేందర్  మాట్లాడారు. 

నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ అందించాలని భావించాను. కానీ ఆ అవకాశం చిక్కలే.. నేరుగా స్పీకర్ గారికి ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ గారు కరోనా అడ్డం పెట్టుకొని కలవలేదు. అనివార్యమైన పరిస్థితుల్లో సెక్రెటరీ కి ఇచ్చాన అని ఈటెల రాజేందర్ అన్నారు.  

"

అసెంబ్లీ లో అంతా నియంతృత్వం అని గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు అన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి నీ కూడా అనుమతించలేదని వాపోయారు. 

అసెంబ్లీ ప్రజల ఆశలను ప్రతిబింబించాలి. కానీ, ఇక్కడ కెసిఆర్ గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతుందన్నారు.  కెసిఆర్ గారు ఈ రాజ్యాంగం ఏంది? ఎమ్మెల్యే, ఎంపీలు ఏంటి అనే భావనలో ఉన్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు మాకు ఎదురైన అనుభవం అన్నారు. 

ఈ వెకిలి చేష్టలు, నకిలీ ప్రయత్నాలు ఆపకపోతే నీకే ఎదురు తిరుగుతాయని హెచ్చరించారు.  చిల్లర ప్రయత్నాలు ఇక సాగవు అని..హుజూరాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు. కానీ ఇప్పుడు ఆగ మేఘాల మీద ఎన్నికల కోసం పెన్షలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 

నాకు మద్దతు తెలిపితే పెన్షన్ ఆపెస్తా అంటున్నారు.. ఆయనేం ఇంట్లో నుండి ఇవ్వడం లేదు గుర్తు పెట్టుకోవాలి..హుజూరాబాద్ చైతన్యం గల గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తారు ఇక్కడి ప్రజలు అని అన్నారు.  

ఇది ధర్మ-అధర్మం, డబ్బు సంచులకి-ఆత్మగౌరవనికి మధ్య జరిగే పోరాటం అని చెప్పుకొచ్చారు. నా DNA అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్షం గా రైట్ పార్టీలో చేరుతున్నా అన్నారు. 

మళ్లీ గెలిచి బుద్ది చెబుతా అన్నారు.  ఏనుగు రవిందర్ రెడ్డి, తుల ఉమ, అందే బబాన్న, vk మహేశ్, కేశవ రెడ్డి, గండ్ర నళిని, సత్యనారాయణతో పాటు అనేక మందిమి చేరుతున్నామన్నారు. 

మా తరువాత అన్ని జిల్లాల నుండి వేలాదిగా చేరుతారని చెప్పుకొచ్చారు. తమకు లెఫ్ట్ సంఘాలు కూడా సంఘీభావం ఉందని తెలిపారు.  RSU నుండి RSS వరకు అందరూ నియంత పాలన అంతమొందించడానికి కలిసి వస్తున్నారన్నారు. 

20 ఏళ్ల తరువాత 2021 లో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమం మొదలు పెడుతున్నాం. కేటీఆర్ 2018 లోనే కౌశిక్ రెడ్డికి డబ్బులు పంపించి నన్ను ఓడ గొట్టడనికి ప్రయత్నం చేశారు. నా ఇంటిమీద రైడ్ చేయించారు. ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. 

ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు. బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు.
నన్ను కాల గర్భంలో కలపాలి అనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతుంది. నియంత పాలన అంతం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios