Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు.. ఆ సత్తా హరీష్‌కు ఉందా?: ఈటల

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని విమర్శించారు.

Etela Rajender sensational Comments On KCR and Harish Rao ksm
Author
First Published Nov 18, 2023, 4:38 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అనుమతి లేనిదే చీమ కూడా చిటుక్కుమనదని విమర్శించారు. కేసీఆర్‌ను కాదని ఏ మంత్రి కూడా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీలు, దళితులు, గిరిజనులను ముఖ్యమంత్రి చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని సవాలు విసిరారు. 

బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీకి కోపం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ముఖ్యమంత్రి పదవి అని, ఇతరులకు అవకాశం రాదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అగ్రకులాల వారే ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లవుతున్నా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు.  పదేళ్లు గడిచినా డబుల్ బెడ్రూం ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తామంటే నమ్మడం ఎలా? అని ప్రశ్నించారు. గాడిదలకు గడ్డి పెడితే... ఆవులు పాలిస్తాయా? అని కేసీఆర్ చెప్పారని.. ఇది నిజమేనని, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఏమీ రాదని ఈటల ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios