టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఆత్మీయ బంధం లేదని అన్నారు. 


టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఆత్మీయ బంధం లేదని అన్నారు. కేసీఆర్‌కు, ఎమ్మెల్యేలకు మధ్య అవసరాల సంబంధం మాత్రమే ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్‌ ప్రబుత్వం అపనమ్మకంతో అవసరాల కోసం కొనసాగుతుందని విమర్శించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని తాము కూల్చాల్సిన అవసరం లేదని.. అదే కూలిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని.. అది పైకి లేచే పరిస్థితి లేదని కామెంట్ చేశారు. 

ఇక, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్‌లో తనకెవరూ శత్రువులు లేరని ఈటల చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. చాలా మంది టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్‌తో కంటే తనతోనే వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌గా ఉన్న ఈటల రాజేందర్.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పలువురు ప్రముఖులను పార్టీలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోవడంలో ఈటల కీలకంగా వ్యవహరిస్తున్నారు.