హైదరాబాద్: ఖైరతాబాద్ గణేషుడికి పూజ చేస్తే రాష్ట్రం మొత్తం బాగుంటుందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ఇదే చివరి పూజ కానుంది.

ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వద్ద గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం నాడు తొలిపూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 9 ఏళ్లుగా ఖైరతాబాద్ గణేషుడికి  పూజలు చేయడం అలవాటుగా మారిందన్నారు.

నరసింహన్ ఎక్కడున్నా కూడ ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ చేసేందుకు రావాలని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. గవర్నర్ దంపతులను నాగేందర్ దంపతులు సన్మానించారు. గవర్నర్ దంపతులకు నాగేందర్ దంపతులు బహుమతిని అందించారు.

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను బదిలీ చేశారు. తెలంగాణకు తమిళ్‌సై సౌందర రాజన్ ను గవర్నర్ గా నియమిస్తూ ఆదివారం నాడు ఉత్తర్వులు  జారీ అయ్యాయి. త్వరలోనే సౌందర రాజన్  తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.

సంబంధిత వార్తలు

ఖైరతాబాద్ గణేషుడికి 750 కిలోల లడ్డు బహుకరణ