హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంలో  కీలక పాత్ర పోషించిన సురేంద్రనాథ్ బాబు అనే అధికారిని ఏసీబీ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. నిబంధలనకు విరుద్దంగా ఆరేళ్లుగా దేవీకారాణి  కార్యాలయంలోనే సురేంద్రనాథ్ బాబు విధులు నిర్వహిస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈఎస్ఐలలో పనిచేసే పలువురు ఫార్మాసిస్టులను బెదిరించి దొంగ బిల్లులను సురేంద్రనాథ్ బాబు తయారు చేయించినట్టుగా ఏసీబీ గుర్తించింది.మెడికల్ క్యాంపులు నిర్వహించకుండానే బిల్లులను తయారు చేయించాలని ఫార్మాసిస్టులను సురేంద్రనాథ్ బాబు బెదిరించాడని ఏసీబీ నిర్ధారించింది. 

బిల్లులు తయారు చేయని వారిపై సురేంద్రనాథ్ బాబు బెదిరింపులకు పాల్పడినట్టుగా ఏసీబీ అభిప్రాయపడింది.  ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు సోమవారం నాడు  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. సురేంద్రనాథ్ బాబును కస్టడీలోకి తీసుకోని విచారించాలని ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు కోర్టులో ఏసీబీ  కస్టడీ పిటిషన్ ను దాఖలు చేయనుంది


సంబంధిత వార్తలు

ఈఎస్ఐ స్కాం: బయటపడుతున్న దేవికారాణి లీలలు..