కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. జిల్లాలోని చెన్నపురం సమీపంలోని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ వ్యక్తిని కొట్టి చంపారు.

కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ఇటీవల కాలంలో మొదలయ్యాయి. మావోల కదలికలను పసిగట్టిన పోలీసులు కూంబింగ్  చేపట్టారు.మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కూడ చోటు చేసుకొన్నాయి.

ములుగు జిల్లాలో ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారే నెపంతో మల్లంపల్లి ఈశ్వర్ అనే వ్యక్తిని మావోయిస్టులు కొట్టి చంపారు. ములుగు జిల్లాకు చెందిన ఈశ్వర్ గా పోలీసులు గుర్తించారు. ఈశ్వర్ ను కోరుగొండ సమీపంలో కొట్టిచంపారు.

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇటీవల కాలంలో  మావోయిస్టుల కదలికలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.మావోల ఏరివేత కోసం పోలీసులు  పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు.