టిఆర్ఎస్ ఎర్రబెల్లికి సొంత అల్లుడి భారీ షాక్

Errabelli faces opposition from son-in-law
Highlights

షాకింగ్ న్యూస్...

2014 ఎన్నికల్లో టిడిపి తరుపున గెలిచారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలో ఉన్నా ఆయన మాత్రం టిడిపిలోనే ఉన్నారు. టిఆర్ఎస్ నుంచి ఎంత వత్తిడి వచ్చినా టిడిపిన వీడలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో టిడిపి తరుపునే గెలిచారు. ఆయన సేవలను గుర్తించిన టిడిపి శాసనసభాపక్ష నేతగా పదవిని కట్టబెట్టింది. కానీ అనంతర కాలంలో బంగారు తెలంగాణ సాధన కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరుడే కాదు ఏకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని కూడా విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చి వివాదం రాజేశారు. అదంతా పాతు ముచ్చట. కానీ ఇప్పుడు అసలు ముచ్చకు పోదాం రండి.

ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత అల్లు మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎర్రబెల్లితోపాటే టిఆర్ఎస్ లో ఉన్నారు. కానీ ఆయన రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎర్రబెల్లి కూతరు ప్రతిమ భర్త మధన్ మోహన్ రావు కూడా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఎర్రబెల్లితోపాటు టిడిపిలో క్రియాశీల రాజకీయాలు నడిపారు. కామారెడ్డికి చెందిన మదన్ మోహన్ రావు 2014 ఎన్నికల్లో ఎన్డీఎ అభ్యర్థిగా (టిడిపి నుంచి) జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. అప్పుడు టిఆర్ఎస్ గాలి నడుస్తున్న సమయం కావడంతో ఆయనకు 2లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు. తెలుగుదేశం పార్టీలో టిఎన్ఎస్ఎఫ్ జాతీయ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. టిడిపి కార్యదర్శి పదవిలోనూ పనిచేశారు. 2013లో తెలంగాణలో 1400 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి 700 గ్రామాలను చుట్టొచ్చారు.

అయితే మామ ఎర్రబెల్లి టిఆర్ఎస్ లో చేరిన కొద్దిరోజుల్లోనే మదన్ మోహన్ రావు కూడా టిఆర్ఎస్ గూటికి చేరారు. కానీ టిఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోయారు. మూడేళ్లు గడుస్తున్నా టిఆర్ఎస్ లో ఆయనను పార్టీ నాయకత్వం గుర్తించలేదన్న ఆవేదనతో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో మదన్ మోహన్ రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు చెబుతున్నారు. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయాన్ని మదన్ మోహన్ రావు కూడా ‘ఏషియానెట్’ కు ధృవీకరించారు.

loader