నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో వేధింపులు నిజమే: సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక


నార్సింగి  శ్రీచైతన్య కాలేజీ విద్యార్ధి  సాత్విక్  ఆత్మహత్యపై  ప్రభుత్వం  ఏర్పాటు  చేసిన కమిటీ నివేదికను అందించింది.  ఈ కాలేజీలో  సాత్విక్ ను వేధించిన మాట వాస్తవమేనని  కమిటీ గుర్తించింది.  

Enquiry Committee Submits Report on Satwik Suicide Case in Hyderabad


హైదరాబాద్:  నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ పై వేధింపులు నిజమేనని  ప్రభుత్వం  నియమించిన కమిటీ నిర్ధారించింది.   గత నెల  28వ తేదీన  నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీలో  ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి  సాత్విక్ ఆత్మహత్య  చేసుకున్నాడు.ఈ ఘటనపై  రాష్ట్ర ప్రభుత్వం  విచారణకు కమిటీని ఏర్పాటు  చేసింది.  ఈ  కమిటీ  ఐదు రోజుల పాటు  విచారణ  నిర్వహించింది. ప్రాథమిక నివేదికను  రాష్ట్ర ప్రభుత్వానికి  అందించింది. 

శ్రీచైతన్య కాలేజీలో  కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఈ కమిటీ   తేల్చి  చెప్పింది.  వేరే కాలేజీలో  సాత్విక్ ఆడ్మిషన్ ఉన్న విషయాన్ని కమిటీ గుర్తించింది.  వేరే కాలేజీలో  ఆడ్మిషన్ ఉన్నా కూడా  నార్సింగి  కాలేజీలో  సాత్విక్   చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ  ప్రస్తావించింది. 

రాష్ట్రంలోని అన్ని కార్పోరేట్   కాలేజీల్లో  ఇదే రకమైన  పరిస్థితి ఉందని  కమిటీ  అభిప్రాయపడింది. శ్రీ చైతన్య కాలేజీలో  క్లాసులు నిర్వహిస్తున్న విషయాన్ని కమిటీ   పేర్కొంది. కానీ  విద్యార్ధులకు సర్టిఫికెట్లను  చిన్న కాలేజీల పేరుతో జారీ  చేస్తున్నారని కమిటీ గుర్తించింది. విద్యార్ధుల అడ్మిషన్లపై  చెక్ చేయాలని కమిటీ  ప్రభుత్వానికి సూచించింది.  

శ్రీచైతన్ కాలేజీలో  సాత్విక్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీకి  చెందిన   కృష్ణారెడ్డి, రవి, ఆచార్య , నవీన్  వంటి  వారు  వేధింపులకు పాల్పడినట్టుగా  సాత్విక్  సూసైడ్ లేఖలో  పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా  ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నలుగురిని రెండు  రోజుల క్రితం  పోలీసులు అరెస్ట్  చేశారు. సాత్విక్ మృతికి  కారణమైన  వారిపై చర్యలు తీసుకోవాలని  పేరేంట్స్, విద్యార్ధి సంఘాలు  పెద్ద ఎత్తున  ఆందోళనలు నిర్వహించిన  విషయం తెలిసిందే

also read:సాత్విక్ ఆత్మహత్య కేసు .. పోలీసుల అదుపులో నలుగురు, సూసైడ్ నోట్‌ ఆధారంగా అరెస్ట్‌లు

సాత్విక్  ను లెక్చరర్లు కొట్టడంతో   గతంలో  15 రోజులు అతను బెడ్ రెస్ట్‌కే పరిమితమైన విషయాన్ని  పేరేంట్స్ గుర్తు  చేస్తున్నారు. సాత్విక్ ను కొట్టవద్దని  చెప్పినా కూడా లెక్చరర్లు పట్టించుకోలేదని  వారు  ఆరోపిస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకొనేలా  వేధింపులకు గురి  చేసిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని  పేరేంట్స్ డిమాండ్  చేస్తున్నారు.  సాత్విక్ లాంటి పరిస్థితి మరో  విద్యార్ధికి రావొద్దని  కూడా   సాత్విక్ పేరేంట్స్  కోరుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో  ప్రతి ఏటా సగటున  3500 మంది  విద్యార్ధులు  ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios