ఈఎస్ఐ స్కాం: మాజీ డైరెక్టర్ సహా పలువురిని ప్రశ్నిస్తున్న ఈడీ

ఈఎస్ఐ స్కాంలో  మాజీ డైరెక్టర్ తో పాటు  ఇతర ఉన్నతాధికారులను  ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Enforcement Directorate Probe On ESI Scam lns

హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంలో  ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను  ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఏసీబీ  కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. అయితే  ఏసీబీ కేసు ఆధారంగా  ఈడీ కూడ  ఈ కేసును విచారిస్తుంది.ఈ కుంభకోణంలో మనీలాండరింగ్ ద్వారా నిధులను మళ్లించినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు. ఈఎస్ఐలో  వందల కోట్ల నిధులు దుర్వినియోగమైనట్టుగా ఈడీ అనుమానిస్తుంది.ఈ విషయమై  ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

ఈ కేసులో  ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి,  అధికారులు నాగలక్ష్మితో పాటు మరికొందరిని  ఈడీ అధికారులు  తమ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ స్కాం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు  పాల్పడినట్టుగా  దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.అంతేకాదు అనర్హులకు  టెండర్లను కట్టబెట్టినట్టుగా తేలింది.   ఈ కేసులో  ఇప్పటికే  బాధ్యులైన  అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది.  ఈ స్కాంపై విచారణ నిర్వహించిన  ఏసీబీ అధికారులు  పలు కీలక అంశాలను బయట పెట్టిన విషయం తెలిసిందే.   ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్ లో వందల కోట్ల రూపాయాల స్కాం జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.  

ఈఎస్ఐ స్కాంపై  2019లో తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ కేసు నమోదు  చేసింది. ఈఎస్ఐ అప్పటి డైరెక్టర్ దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్  పద్మతో పాటు  పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులపై  ఏసీబీ కేసు నమోదు చేసింది.  ఈ స్కాంలో రూ. 211 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఏసీబీ  తేల్చింది.  అయితే  నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులను  2021  లో  రూ. 144 కోట్ల ఆస్తులను  సీజ్ చేసింది. ఈ కేసును  ఈడీ కూడ విచారిస్తుంది. హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయానికి అప్పట్లో  ఈఎస్ఐ స్కాంలో  కీలకంగా వ్యవహరించిన వారిని పిలిచి విచారిస్తుంది ఈడీ.ఈ స్కాంలో ఈడీ అధికారులు  త్వరలోనే  కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతుంది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios