Asianet News TeluguAsianet News Telugu

సీఆర్పీసీ సెక్షన్ 91కింద ఎమ్మెల్సీ కవితకు మరో నోటీసు ఇచ్చిన సీబీఐ.. ‘సౌత్ గ్రూప్’ విషయంలో ఆరా...!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. దీనికి మరోసారి ఆమెను విచారించాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. 

CBI issued another notice to MLC Kavitha under Section 91
Author
First Published Dec 12, 2022, 9:07 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో ఆదివారం సీపీఐ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూపుగా చెబుతున్న వారితో కవితకు ఏమైనా పరిచయం ఉందా? ఎప్పుడైనా వారిని కలిశారా? ఈ మధ్యకాలంలో కవిత ఎందుకు ఫోన్లు మార్చాల్సి వచ్చింది? ఇలాంటి అనేక అంశాలపై  సిబిఐ  అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.

ఆదివారం ఉదయం.. కవిత నివాసంలోని ఆమె వ్యక్తిగత కార్యాలయంలో సిబిఐ అధికారులు విచారించారు. ఉదయం 10.50గంటలనుంచి, సాయంత్రం 6.30వరకు ఈ విచారణ కొనసాగింది. ఏడున్నర గంటల పాటు సిబిఐ బృందం ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఉన్నారు. మధ్యలో  మధ్యాహ్నం 1:30 ఆ సమయంలో ఒక 45ని.లపాటు లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన నిందితుడు అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక ప్రశ్నలు వేశారు. వీటికి ఆమె ఇచ్చిన సమాధానాలు  రికార్డు చేసుకున్నట్లు  సమాచారం.

సీఎం కేసీఆర్‌తో ముగిసిన కల్వకుంట్ల కవిత సమావేశం.. 45 నిమిషాల పాటు భేటీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడైన అమిత్ అరోరాను రిమాండ్ చేసి కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా ఉంది. ఈ గ్రూపును నియంత్రిస్తున్న వారిలో కవిత కూడా ఉన్నారని అమిత్ అరోరా ఈడికి చెప్పారని ఆ రిపోర్ట్ లో పేర్కొంది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదు. కాకపోతే అమిత్ అరోరా  స్టేట్మెంట్ ఈడి రిమాండ్ రిపోర్టు ఆధారంగా  సీబీఐ కవితను ప్రశ్నించాలని నిర్ణయించింది. 

ఈ మేరకు 160 ఆర్ పిసి కింద కవితకు ఈ నెల 2న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ ఆరవ తేదీన విచారణ చేపడతామని తెలిపిన సిపిఐ…ఆ తర్వాత ఆయా తేదీల్లో తనకు పని ఉందని కవిత చెప్పిన సూచనల ప్రకారం 11వతేదీ ఆదివారం ఉదయం విచారణ చేపట్టింది. ఈ విచారణ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కవిత నివాసంలో మొదలు కావాల్సి ఉండగా..10 నిమిషాల ముందే వారు అక్కడికి చేరుకున్నారు. కవిత నివాసానికి వచ్చిన బృందంలో డిఐజి స్థాయి అధికారితో పాటు ఐదుగురు సభ్యులు, ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. విచారణ సమయంలో కవిత తరఫు న్యాయసలహాదారులు కూడా ఉన్నారు. 

ఈ న్యాయ సలహాదారుల సమక్షంలోనే కవితను అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా  సౌత్ గ్రూప్ విషయంలోనే సి.బి.ఐ ప్రధానంగా ప్రశ్నలు వేసిందని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ గా పేర్కొన్న వారికి ఏమైనా పరిచయం ఉందా అనే కోణంలో కవితను ఆరా తీశారు. ‘ఈ స్కామ్ కేసులో  నిందితులైన అమిత్ అరోరాతో పాటు మిగతా వారిని కవిత ఎప్పుడైనా కలిసారా? వారితో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడారా? ఢిల్లీలో వారితో సమావేశాలు జరిగాయా? తరచుగా ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది?  లాంటి అనేక అంశాలపై… అనేక కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే, ఎమ్మెల్సీ కవిత మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు  ఫిర్యాదులో గాని, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో గాని తన పేరు లేని విషయాన్ని కవిత వారికి మరోసారి గుర్తుచేసింది. అయితే ప్రస్తుతం విచారణ ముగిసిందని… కాకపోతే అవసరమైతే మరోసారి విచారణ చేపడతామని..  దీనికి అందుబాటులో ఉండాలని సీబీఐ ఆమెను కోరింది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 91 కింద మరో నోటీసు అందించింది. ఏ రోజు విచారణ చేస్తామనే విషయాన్ని, తేదీని  త్వరలో నిర్ణయించి చెప్తామని తెలిపింది. సీబీఐ విచారణ సమయంలో ఎమ్మెల్సీ కవిత చెప్పిన సమాధానాల ప్రకారం .. ఆయా అంశాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని  కోరడానికే  సిబీఐ ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత మాత్రం ఏ విచారణ అయినా, తాను పూర్తి స్థాయిలో సహకరిస్తనని చెప్పుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios