హైద్రాబాద్ లో  ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి.  ఐటీ, ఈడీ సోదాలు  హైద్రాబాద్ నగరంలో  ఇటీవల సర్వ సాధారణమయ్యాయి. 

హైదరాబాద్: హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ సహా పలువురు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారంనాడు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈ విషయమై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ ముగ్గురి నుండి బ్యాంకు ఖాతాల వివరాలు,పత్రాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు.ఒప్పందానికి విరుద్దంగా 2013లో ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు జరిగాయని కేసు నమోదైంది.వాణిజ్య అవసరాలకు ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు చేపట్టవద్దని కూడ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించి ఉప్పల్ స్టేడియంలో స్టాండ్ లు నిర్మించారు.