Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు: సనత్‌నగర్, ఓయూ సెంటర్ల వద్ద ఉద్యోగుల నిరసన

 జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని ఓయూ, సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉద్యోగులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు.

Employees protest for not alloting duties in Hyderabad lns
Author
Hyderabad, First Published Dec 4, 2020, 10:47 AM IST

హైదరాబాద్:  జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని ఓయూ, సనత్ నగర్ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉద్యోగులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు.

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఉద్యోగులకు విధులు కేటాయించారు. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగులను కౌంటింగ్ కేంద్రం వెలుపలే ఉంచారు. దీంతో ఉద్యోగులు కౌంటింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు.

also read:ఎస్ఈసీ ఉత్తర్వులు: ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ

పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 200 మంది ఉద్యోగులు తమకు విధులు కేటాయించాలని కోరుతూ ఆందోళనకు దిగారు.  అవసరం ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ మందికి విధులు కేటాయించడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.ఇదే తరహాలో ఓయూ డిస్టెన్స్ కాలేజీ కౌంటింగ్ సెంటర్ లో కూడ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

వివిధ జిల్లాల నుండి కౌంటింగ్ విధుల కోసం  వచ్చిన ఉద్యోగులకు ఆర్డర్ కాపీలు అందిన తర్వాత డ్యూటీలు లేవని చెప్పడంతో  ఉద్యోగులు నిరాశకు లోనయ్యారు.  వివిధ జిల్లాల నుండి ఉదయం నాలుగు గంటల నుండి  విధుల కోసం ఆయా కౌంటింగ్  సెంటర్ల కు చేరుకొన్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.దీంతో విధులు  దక్కని ఉద్యోగులు కౌంటింగ్ సెంటర్ వద్ద నిరసనకు దిగారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios