ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుడు ఘటనలు పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. 

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలుడు ఘటనలు పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వివరాలు.. వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఉంటే కోటేశ్వర్‌రావు ఏడాది క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. శనివారం రాత్రి ఎలక్ట్రిక్‌ బైక్‌కు చార్జింగ్‌ పెట్టగా.. బ్యాటరీ పేలి పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు ఆందోళ చెందారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇక, కొటేశ్వర్ రావు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని.. అతడు రాత్రి 8 గంటల సమయంలో పార్క్ చేసిన బైక్‌కు చార్జ్ చేయడానికి స్విచ్ ఆన్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అది పేలడంతో.. కోటేశ్వర్ రావు చేతులు, ఇతర శరీర భాగాలకు కాలిన గాయాలయ్యాయ్యని చెప్పారు. ప్రస్తుతం కోటేశ్వర్ రావుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.