వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న తెలంగాణ బీఎస్పీ, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తున్నారంటే..?

Sirpur: రానున్న ఎన్నిక‌ల్లో సిర్పూర్ నుంచి తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. సిర్పూర్ ప్రజలకు డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదనీ, బీఆర్ఎస్ పాలనలో ఇక్క‌డివారు విస్మరించబడుతున్నారని పేర్కొన్నారు. 
 

Elections : Telangana BSP chief R S Praveen Kumar to contest from Sirpur

Telangana Bahujan Samaj Party (BSP) RS Praveen Kumar: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుమురంభీం ఆసిఫాబాద్ ప్రాంతంలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ నాయ‌కుడు (బీఎస్పీ), మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కాగజ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అండదండలతో కాంట్రాక్టర్లు, దోపిడీదారులు రాజ్యమేలుతున్నారన్నారని ఆరోపించారు.\

సిర్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను టార్గెట్ చేస్తూ కాగజ్ న‌గ‌ర్ (సిర్పూర్) పేపర్ మిల్ యాజమాన్యం ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఉద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. యాజమాన్యం పొరుగు రాష్ట్రాల సిబ్బందికి అధిక వేతనాలు చెల్లిస్తుండగా, స్థానిక ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు. అంధవెల్లి బ్రిడ్జిని ప్రస్తావిస్తూ బిల్లులు చెల్లిస్తున్నా పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ప్రారంభం కాకముందే అంధవెల్లి వంతెన కూలిపోయిందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సిర్పూర్ ప్రజలను విస్మరిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో నోటిఫైడ్, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. డబుల్ బెడ్ రూం గృహనిర్మాణం, దళితబంధు వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఈ ప్రాంత వాసులకు అందడం లేదని ఆరోపించారు. "బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాం, కొమురం భీంల వాదంతో, వారసులతో పునీతమైన సిర్పూర్-కాగజ్ నగర్ గడ్డపై చారిత్రాత్మక బహుజన యాత్రలో స్థానిక ప్రజల నుండి ఆశీర్వాదం తీసుకున్నాను. సిర్పూర్ గడ్డను వలస వాదుల- దోపిడి దొరల నిరంకుశ పాలన నుండి విముక్తం చేసే దాకా విశ్రమించేది లేదని" ఆయ‌న ట్వీట్ చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios