Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు ఎన్నికలు.. కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ అంటే..

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

elections.. kcr announced his consituncy also..
Author
Hyderabad, First Published Sep 6, 2018, 4:17 PM IST

తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పడటంతో.. ఆయన ఈ రోజు అసెంబ్లీని రద్దు చేశారు. తాజాగా.. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా కేసీఆర్ ప్రకటించారు.

కాగా.. తాను పోటీ చేసే స్థానంపై కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. గజ్వేల్ నుంచే మరోసారి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 2014లో ఇక్కడి నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసి.. సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా.. 2014 లో గజ్వేల్ నియోజకవర్గం నుండి ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఏడాది ప్రతాప్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సారెడ్డి  ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఓ కార్పోరేషన్ ఛైర్మెన్ గా ఉన్నారు. 
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios