తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు: నేడు తుది ఓటర్ల జాబితా

తెలంగాణలో తుది ఓటరు జాబితాను  ఇవాళ  విడుదల చేయనుంది ఈసీ.  అయితే  విచారణ చేయకుండానే ఓటరు  నమోదు, తొలగింపు చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ElectionCommission to release final voter list today lns

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తును మరింత ముమ్మరం చేసింది.  బుధవారంనాడు తుది ఓటర్ల జాబితాను  ఎన్నికల సంఘం  విడుదల చేసే అవకాశం ఉంది.తెలంగాణలో 3.13 కోట్ల మంది ఓటర్లున్నట్టుగా ఈసీ  చెబుతుంది. ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు  కొత్తగా ఓటరు నమోదు కోసం 13.06 లక్షల మంది ధరఖాస్తులు చేసుకున్నారు. మరో వైపు ఓటరు జాబితా నుండి 6.26 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఓటర్ల జాబితాలో  పేర్ల నమోదు, తొలగింపునకు సంబంధించి విచారణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని  రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.  క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండానే  ఓటర్ల తొలగింపు, నమోదుకు చర్యలు తీసుకోవడంపై  రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి.ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

ఓటర్ల నమోదు ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.గతంలో కూడ బోగస్ ఓటర్లు చోటు చేసుకున్నా కూడ అధికారులు  చర్యలు తీసుకోలేదని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నారు. 

తుది ఓటర్ల జాబితా విడుదలను నిలిపివేయాలని  కాంగ్రెస్ కోరింది.  కొత్త ఓటరు నమోదుకు వచ్చిన ధరఖాస్తులను ఇంటి నెంబర్ వారీగా  పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అంతేకాదు  అసాధారణంగా ధరఖాస్తులు ఎక్కడి నుండి వస్తున్నాయో పరిశీలించాలని కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం నిన్న హైద్రాబాద్ కు వచ్చింది. నిన్నటి నుండి  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఈసీ బృందం సమీక్షలు నిర్వహిస్తుంది. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో  సీఈసీ రాజీవ్ కుమార్ బృందం సమావేశమైంది.  రేపు  తెలంగాణ సీఎస్, డీజీపీలతో  సీఈసీ బృందం భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  సీఈసీ రాజీవ్ కుమార్  మీడియాతో మాట్లాడనున్నారు. 

also read:హైద్రాబాద్‌కు చేరుకున్న సీఈసీ బృందం: రాజకీయ పార్టీలతో భేటీ

ఈ నెల 6వ తేదీ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. దీంతో రాజకీయ పార్టీలు కూడ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు  రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ  తాము ప్రకటించిన గ్యారెంటీ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios